: భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోన్న బెంగళూరు.. ఐపీఎల్ మ్యాచ్‌కు తొలిసారి డుమ్మా కొట్టిన రైనా
ఐపీఎల్-9 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డీ విల్లియర్స్, కోహ్లీ చెలరేగి ఆడడంతో బెంగళూరు టీమ్ భారీస్కోరు దిశగా పరుగులు తీస్తోంది. డీ విల్లియర్స్ సెంచరీ బాదేస్తే, కోహ్లీ హాఫ్ సెంచరీ దాటేసి మైదానంలో అదరగొడుతున్నాడు. అయితే, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఈ మ్యాచ్‌కు డుమ్మాకొట్టాడు. ఐపీఎల్ అన్ని సీజన్లలోనూ ఇంతవరకూ ఒక్క మ్యాచ్‌కి కూడా డుమ్మా కొట్టకుండా గుడ్‌బాయ్ అనిపించుకున్న రైనా నేటి మ్యాచ్‌లో కనపడకపోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఈ అంశమే చర్చనీయంగా మారింది. తన భార్య డెలివరీ కానున్న కారణంగా తనకు తొలి సంతానం కలుగుతుందంటూ కొన్ని రోజుల క్రితం ముందు ఎంతో సంతోషంతో రైనా ఆమ్‌స్టర్‌డ్యాంకు వెళ్లాడు. దాంతో, గుజరాత్ లయన్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను బ్రెండన్ మెకల్లమ్ చేపట్టాడు.