: ‘హోదా’ కోసం వెంకయ్య పోరాడారు, నాటి ప్రధాని హామీ ఇచ్చారు: గ‌ంటా శ్రీ‌నివాసరావు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేసిన సంద‌ర్భంగా ఆ అంశంపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా కోసం గ‌తంలో వెంక‌య్య‌నాయుడు రాజ్య‌స‌భ‌లో ఎన్నోసార్లు గ‌ళం విప్పార‌ని గుర్తుచేశారు. నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ హోదాపై హామీ కూడా ఇచ్చార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. నాడు ఏపీకి హోదాపై అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయ‌ని గంటా గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు తాము ఇచ్చిన మాట మీద నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ మ‌ధ్య విభేదాలపై స్పందించిన ఆయ‌న.. ఈ ప‌రిణామం స‌రైంది కాద‌న్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాపై పోరాడుతూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

  • Loading...

More Telugu News