: కర్నూలు ప్రసూతి వార్డులో ఘోరం... బకెట్లలో మృత శిశువులు
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో గత కొంతకాలంగా సిబ్బంది చేస్తున్న దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో మృత శిశువులను బకెట్లలో దాచిన అమానవీయ వైనం కలకలం రేపుతోంది. ఈ ఉదయం జిల్లా ఎస్పీ ఎ.రవికృష్ణ ప్రభుత్వాసుపత్రిని సందర్శించగా, ఈ విషయం బయటపడింది. గత కొన్నాళ్లుగా మరణించిన శిశువులను ఖననం చేయకుండా సిబ్బంది బకెట్లలో దాచి వుంచారు. గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా మృత శిశువులు ఖననానికి నోచుకోలేదని తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎస్పీ, స్వయంగా ఖననానికి ఏర్పాట్లు చేశారు. గుత్తేదారుపై కేసు పెడుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.