: భక్తజనసంద్రంతో తిరుమల కిటకిట!


ఓ వైపు వేసవి సెలవులు, మరోవైపు వివిధ తరగతుల పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు తరలివస్తున్న విద్యార్థులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. దీనికితోడు శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారం కూడా కలిసిరావడంతో, ఈ ఉదయమే వైకుంఠంలోని క్యూ కాంప్లెక్సులన్నీ నిండిపోగా, నారాయణగిరి ఉద్యానవనంలో కిలోమీటరు మేరకు క్యూలైన్ పెరిగిపోయింది. వీరికి దర్శనం కావడానికి కనీసం 16 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న భక్తులు సైతం స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కంపార్టుమెంట్లతో పాటు, నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యార్థం పాలు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పెద్దఎత్తున పంపిణీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News