: ‘సోలార్ కిడ్స్’ ఆరోగ్యంలో కొంత పురోగతి


అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న ఇస్లామాబాద్ కు చెందిన సోలార్ కిడ్స్ రషీద్ (9), హషీమ్(13) ల ఆరోగ్యంలో కొంత పురోగతి కనపడింది. సూర్యుడు ఉన్నంత సేపు ఉత్సాహంగా ఉండటం, సూర్యాస్తమయం కాగానే తమలో చైతన్యాన్ని కోల్పోతున్న ఈ సోలార్ కిడ్స్ కు అధునాతన వైద్యం అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత రాత్రి సమయంలో వాళ్లిద్దరూ స్వయంగా మెట్లు ఎక్కడమే కాకుండా, మంచినీరు కూడా తాగారని పిల్లల తండ్రి మహమ్మద్ హషిం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు. పిల్లలిద్దరికీ 300 సార్లకు పైగా డీఎన్ఏ టెస్టులు నిర్వహించారన్నారు. అయితే, న్యూరో ట్రాన్స్ మిషన్ ట్రీట్ మెంట్ ద్వారా వారిలో కొంత మార్పు వచ్చిందని చెప్పారు. సోలార్ కిడ్స్ వ్యాధి గురించి తెలుసుకునేందుకు అమెరికా మేరీ లాండ్ యూనివర్శిటీ బృందం కూడా సహకరిస్తోంది.

  • Loading...

More Telugu News