: హోదా ఇచ్చేది లేదు...ప్రజల్లోకి మేము వెళ్తాము...నిజాలు చెబుతాము: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పి, ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ తెలిపారు. టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రజలను తాము ఒప్పించగలమని ఆయన అన్నారు. నిజాలు చెబుతామని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా గురించి రాజకీయ నాయకులు అపోహలు కల్పిస్తున్నారు తప్ప ప్రజలకు వాస్తవాలు తెలుసని, తమను సాదరంగా ఆహ్వానిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమను తిరస్కరిస్తారని చెబుతున్న ఇతర పార్టీలనే ఏపీ ప్రజలు తిరస్కరిస్తారని ఆయన అన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ అబద్ధాలు చెబుతున్నాయని, తమ పార్టీ ప్రజలకు నిజాలు చెబుతోందని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నేతలను తాము ఒప్పించాల్సిన అవసరం లేదని, తమను ప్రజలే ఆదరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.