: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈ రోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 301 పాయింట్లు నష్టపోయి 25,490 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 7,815 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో ఏషియన్ పెయింట్స్ సంస్థ షేర్లు అత్యధికంగా 1.67 శాతం లాభపడి రూ.944.30 వద్ద ముగిశాయి. వీటితో పాటు ఐడియా, భారతీ, ఇన్ఫ్రా టెల్, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. కాగా, హిందాల్కో షేర్లు అత్యధికంగా 4.12 శాతం నష్టపోయి రూ.89.55 వద్ద ముగిశాయి. వీటితో పాటు ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యునీలివర్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.

  • Loading...

More Telugu News