: రజనీ ‘కబాలీ’ టీజర్ కు కోటి 71 లక్షల హిట్లు.. బాలీవుడ్ టీజర్ల రికార్డు దుమ్ముదులిపిన రజనీ
‘కబాలీ’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్రతీరు ఎలా ఉంటుంది..? ఆయన ఎటువంటి స్టైల్‌తో ఈసారి అదరగొడతాడు..? డైలాగ్ డెలివరీ ఎలా చేయబోతున్నాడు.. ? అని ఆత్రుతగా ఎదురు చూసిన అభిమానులకు ‘కబాలీ’ టీజర్ ద్వారా సమాధానం లభించింది. టీజర్‌లో ‘కబాలీ’ స్టైల్‌కు అభిమానులు మంత్ర ముగ్ధులైపోతున్నారు. టీజర్ విడుదలైనప్పటి నుంచీ యూట్యూబ్‌లో హిట్లపై హిట్లు వచ్చిపడుతూ.. రికార్డులను తిరగరాసేస్తోంది రజనీ స్టైల్. మే 1న విడుదలైన కబాలీ టీజర్ కు ఇప్పటి వరకు యూట్యూబ్‌లో కోటి 71 లక్షల హిట్లు వచ్చిపడ్డాయి. దీంతో అత్యధిక హిట్లు వచ్చిన భారత సినిమా టీజర్గా కబాలీ రికార్డు నెలకొల్పింది. దీంతో కబాలీ హిట్ల వేగానికి గతంలో బాలీవుడ్ సినిమాల టీజర్లు సాధించిన రికార్డులన్నీ పటాపంచలైపోయాయి.