: నిధులపై శ్వేతపత్రం విడుదలకు కేంద్రం రెడీ... టీడీపీ రెడీయా?: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సవాల్


విజయవాడలో జరుగుతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావడం లేదని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఏకంగా సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయన్న విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తుందని, తెలుగుదేశం కూడా అదే తరహాలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారని అడిగిన ఆయన, రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన డబ్బును పక్కదారి పట్టించారని ఆరోపించారు. నిధుల విషయంలో పూర్తి అవాస్తవాలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News