: ప్రత్యేక హోదా బిల్లు పత్రాలతో రాజ్యసభకు కేవీపీ... పట్టుబట్టి తీరుతానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలని, విభజన చట్టంలో రూపొందించిన అన్ని అంశాలనూ పాటించాలని డిమాండ్ చేస్తూ, రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, బిల్లుకు సంబంధించిన అన్ని పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు. లోనికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, నేడు బిల్లుపై చర్చకు, ఓటింగుకు పట్టుబట్టనున్నట్టు తెలిపారు. ఈ బిల్లుపై ఇవాళే చర్చించి, ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, నేడు కేవలం పదవీ విరమణ చేయనున్న సభ్యులకు వీడ్కోలు మాత్రమే పలుకుతామని, మరే అజెండా లేదని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుల కేకల మధ్యే రాజ్యసభ కొనసాగుతోంది.