: అమరావతి ప్రజలకు ఆరోగ్యరక్ష.. పదేళ్లపాటు ఉచిత వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతి వాసులకు ప్రభుత్వం ఆరోగ్యరక్ష కల్పించనుంది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని నగరంలో నివసించే ప్రజలకు పదేళ్లపాటు ఉచిత వైద్యం అందించనుంది. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీకి ముందు నుంచి అక్కడ నివసిస్తోన్న ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. తెలుపు, గులాబీ రంగు రేషన్ కార్డులు కలిగి ఉన్న రాజధాని వాసులకు ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవలను ఉచితంగా పొందచ్చని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ కు అందించే నిధుల ద్వారా ఈ పథకంతో ఏ చికిత్సనయినా ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా పొందవచ్చు.