: మూడు విడతల్లో ఉద్యోగుల తరలింపు: మంత్రి నారాయణ


ఏపీ సచివాలయ ఉద్యోగులను అమరావతికి మూడు విడతలుగా తరలించనున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులను మూడు విడతలుగా, తొలుత జూన్‌ 27న 4వేల మందిని, జులైలో 3 వేల మందిని, ఆగస్టులో మరో 3 వేల మంది ఉద్యోగులను అమరావతికి తరలిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17న ఢిల్లీ వెళ్లి ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని ఆయన చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూనే కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేకహోదా సాధిస్తామని ఆయన అన్నారు. తిరుపతి నగరపాలక ఎన్నికలు అక్టోబర్‌ లేదా నవంబర్‌ లో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా 41 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News