: అందులో కళను చూడాలి గానీ, నేనెలా ఉంటే మీకెందుకంటూ బిపాసా రుసరుస!
ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్ తో మాల్దీవుల్లో హనీమూన్ గడుపుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాసా బసు, ఎప్పటికప్పుడు తమ హనీమూన్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రైవేట్ చిత్రాలను అందరికీ చూపడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, కాస్తంత ఘాటుగానే స్పందించిందీ కొత్త పెళ్లి కూతురు. తాను పెడుతున్న పోస్టుల్లో టవల్ ఆర్ట్ ఉందని, ఓ టవల్, బ్లాంకెట్లను అందమైన హంసలుగా, మానవ రూపాల్లో, కోతిలా, కుందేలులా చుట్టి మడతలు పెట్టడం అంత సులువు కాదని చెబుతోంది. కళను చూడకుండా విమర్శలు ఏంటని క్లాస్ పీకింది. తనకు టవల్ ఆర్ట్ ఎంతో నచ్చిందని, వీటి ఫోటోలు మరిన్ని పెడతానని చెప్పింది. నేను ఎలా వున్నా, హనీమూల్ ఎలా చేసుకున్నా మీకెందుకని ప్రశ్నించింది.