: రేపటి నుంచి వికలాంగులకు ఉచితంగా ‘సుప్రీమ్’ సినిమా: హీరో సాయిధరమ్ తేజ్


‘మెగా’ ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుప్రీమ్’ సినిమాను థియేటర్లలో ఉచితంగా చూసే అవకాశం వికలాంగులకు కల్పించారు. ఈ మేరకు సాయిధరమ్ తేజ్ ఒక ట్వీట్ చేశారు. రేపటి నుంచి నుంచి ఈ అవకాశం వారికి కల్పిస్తున్నామని అన్నారు. కాగా, సాయిధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వికలాంగుల కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఇటీవల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News