: భూవివాద సమస్య.. తహశీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో రైతు మృతి
మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు తహశీల్దారు కార్యాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. భూవివాదానికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతు లక్ష్మయ్య గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. భూవివాద సమస్య పరిష్కారం నిమిత్తం మూడు నెలలుగా తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగీ అలసిపోయిన లక్ష్మయ్య గుండెపోటుకు గురయ్యాడు. కార్యాలయం ఆవరణలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు తహశీల్దారు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. మూడు నెలలుగా తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆందోళన చేశారు.