: ప్రీతి జింటా తిట్లకు జడుసుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోచ్ సంజయ్ బంగర్!
తాను యజమానిగా ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కూడా కలసిరాకపోగా, ప్రీతి జింటా తన ఆగ్రహాన్ని జట్టు కోచ్ సంజయ్ బంగర్ వైపు చూపుతూ అందరి ముందే ఇష్టమొచ్చినట్టు తిట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ పది మ్యాచ్ లాడిన జట్టు, మూడింటిలో మాత్రమే నెగ్గి, తదుపరి రౌండ్ కు వెళ్లే అవకాశాలను కోల్పోయింది. గత సంవత్సరంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన జట్టు, ఈ సంవత్సరం కూడా అక్కడే ఉంది. ఇక మ్యాచ్ లలో ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, రాణిస్తున్న అక్సర్ పటేల్ ను ఆపి ఫర్మాన్ బెహర్దీన్ ను పంపడం ప్రీతికి పట్టరాని కోపం తెప్పించాయని, దీంతో ఆమె నోటికి పని చెప్పడంతో, సమాధానం చెప్పలేక బంగర్ వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు పలు మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. కాగా, ఈ కథనాలు అవాస్తవమని ప్రీతి జింటా వెల్లడించింది.