: పెరిస్కోప్ లో లైవ్ చూపుతూ రైలు కింద పడి మరణించిన 19 ఏళ్ల యువతి
ప్రత్యక్ష ప్రసార సామాజిక మాధ్యమ సేవలు అందిస్తున్న పెరిస్కోప్ లో లైవ్ చూపుతూ, రైలు కింద పడి మరణించిన 19 ఏళ్ల యువతి వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. గుర్తు తెలియని ఈ యువతి తనపై అత్యాచారం జరిగిందని చెబుతూ, అతని పేరు చెప్పి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆఖరి మాటలనే స్టేట్ మెంట్ గా పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆత్మహత్య మంగళవారం తెల్లవారుఝామున దక్షిణ పారిస్ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో పెరిస్కోప్ స్ట్రీమింగ్ చూస్తున్న కొందరు పోలీసులను అలర్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.