: హస్తినకు చేరిన గవర్నర్... తెలుగు రాష్ట్రాల్లోని కరవుపై ప్రధానికి నివేదిక
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న రాత్రికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకే ఆయన హస్తిన పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో నేడు వరుస భేటీలు నిర్వహించనున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చించేందుకే కేంద్రం ఆయనను ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. దీంతో కరవుపై ప్రత్యేక నివేదికలతోనే ఢిల్లీ చేరుకున్న నరసింహన్... ప్రధానికి ఆ నివేదికను అందించనున్నారు.