: సుప్రీం జడ్జిగా లావు నాగేశ్వరరావు!... వకీలు నుంచి నేరుగా సుప్రీంకు వెళ్లిన తొలి తెలుగోడు!


సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరో తెలుగు న్యాయ కోవిదుడు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు నాగేశ్వరరావు సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి కొలీజియం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నేడు లావు నాగేశ్వరరావు నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది. న్యాయవాదిగా మాత్రమే పనిచేసిన నాగేశ్వరరావు ఇప్పటిదాకా ఏ స్థాయి కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయలేదు. ఇలా కిందిస్థాయిలో ఏ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా లావు నాగేశ్వరరావు రికార్డులకెక్కారు. ఇక ఇలా సుప్రీం జడ్జి స్థానాన్ని పొందిన రెండో దక్షిణాది న్యాయకోవిదుడు కూడా ఆయనే కావడం గమనార్హం. గత 22 ఏళ్లుగా ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వివిధ కేసులలో సుదీర్ఘ వాదనలు వినిపించిన నాగేశ్వరరావు... అక్కడ సీనియర్ కౌన్సిల్ హోదాను పొందారు. ప్రస్తుతం సీనియర్ కౌన్సిల్ హోదా నుంచి ఆయన నేరుగా న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News