: కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యాలు అందజేసిన సరితా నాయర్


మరో ఐదు రోజుల్లో కేరళ ఎన్నికలు జరగనున్న దశలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, అతని కేబినెట్ సహచరుల సోలార్ స్కాంకు సంబంధించిన ఆరోపణలపై సినీ నటి, వ్యాపారవేత్త సరితా నాయర్ కీలక డిజిటల్ సాక్ష్యాలను ఈ స్కాంను విచారిస్తున్న కమిటీకి అందజేశారు. ఎన్నికలకు కేవలం ఐదు రోజుల సమయం ఉండగా ఆమె తన అస్త్రాన్ని బయటకి తీయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తనను వాడుకుందని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పెన్ డ్రైవ్ లు, కొన్ని కీలక పత్రాలను విచారణ కమిటీకి అందజేశానని ఆమె తెలిపారు. గతంలో తాను రాసిన లేఖలోని అంశాలు, కాంగ్రెస్ పెద్దల పేర్లు బట్టబయలు చేస్తూ ఏషియా నెట్ ఛానెల్ ప్రసారం చేసిన కథనాలకు ఇవి సాక్ష్యాలని ఆమె తెలిపారు. శుక్రవారం మరికొన్ని ఆధారాలను కమిటీకి అందజేస్తానని ఆమె చెప్పారు. సరితా నాయర్, ఎషియా నెట్ ఛానెల్ పై ఉమెన్ చాందీ, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పరువు నష్టం దావా వేశారు. సోలార్ స్కాం కేసులో సరితా నాయర్, ఆమె సహజీవన భాగస్వామి రాధాకృష్ణన్ పై 30కి పైగా కేసులు నమోదు కాగా, సరితా నాయర్ బెయిల్ పై విడుదలయ్యారు. మొదటి భార్య హత్య కేసులో రాధాకృష్ణన్ జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News