: ఢిల్లీ వాసులకు శుభవార్త.. వ్యాట్ 12.5 శాతం నుండి 5 శాతంకు తగ్గింపు!


ఢిల్లీ వాసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు వ్యాట్ ను 12.5 శాతం విధిస్తుండగా, ఇకపై 5 శాతం మాత్రమే విధించాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీలో భారీగా ధరలు తగ్గనున్నాయి. దుస్తులు, బూట్లు, ఈ- రిక్షాలు, హైబ్రిడ్ కార్లు, బ్యాటరీతో నడిచే వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లోలా అదనపు ట్యాక్సులు ఉండకపోవడంతో కొన్ని వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించడంతో మరికొన్ని వస్తువుల ధరలు మరింత తగ్గనున్నాయి.

  • Loading...

More Telugu News