: లోక్ సభ నిరవధిక వాయిదా... రేపు రాజ్యసభ కూడా!


లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గతంలో ప్రకటించిన షెడ్యూలు కంటే రెండు రోజుల ముందే లోక్ సభ నిరవధిక వాయిదా పడడం విశేషం. దీంతో రేపు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడనుందన్న వార్తలు వాస్తవమనేందుకు బలం చేకూరింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును నిరవధిక వాయిదా వేయడం ద్వారా ఆ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేసింది. ఇదే సమయంలో రాజ్యసభలో కొంత మంది సభ్యుల పదవీ కాలం ముగియనుండడంతో కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మద్దతు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చినా సమర్ధవంతంగా అడ్డుకోవచ్చన్న అభిప్రాయంతో బీజేపీ ఉంది. దీంతో ఈ సారి రాజ్యసభను నిరవధిక వాయిదా వేసి, ఏపీకి ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకోవాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News