: శ్రీనగర్ 'నిట్'లో ప్రశాంత వాతావరణం.. విద్యార్థి సంఘాల మధ్య స్నేహభావం వెల్లివిరిసేలా చేస్తామంటోన్న అధికారులు
రెండు నెలల క్రితం టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పై వెస్టిండీస్ ఘనవిజయం సాధించడంతో భారత్ అనుకూల, వ్యతిరేక నినాదాలతో శ్రీనగర్ నిట్ లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య వివాదం చెలరేగి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిట్ క్యాంపస్‌లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. నిట్ విద్యార్థి సంఘాల మధ్య స్నేహభావం మళ్లీ వికసించేలా చేయడానికి నిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిట్‌లో ఈనెల 22-23న నిర్వహించనున్న పూర్వ విద్యార్థుల కలయిక సమావేశంలో నిట్ విద్యార్థి సంఘాల మధ్య స్నేహభావం మళ్లీ చిగురింపజేడానికి కావలసిన అంశాలపై చర్చించాలని నిట్ అధికారులు భావిస్తున్నారు. తద్వారా నిట్ లో మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా చూడాలని యోచిస్తున్నారు.