: ఎర్రగడ్డ మానసిక చికిత్సా కేంద్రానికి 'ఫేస్ బుక్' హీరో
హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫేస్ బుక్ సినిమా హీరో ఉదయ్ కిరణ్ చేరాడు. భానుకిరణ్ అనుచరుడైన ఉదయ్ కిరణ్ పై హైదరాబాదు, కాకినాడల్లో పలు కేసులు ఉన్నాయి. జూబ్లిహిల్స్ లోని దసపల్లా హోటల్ పై దాడికి దిగిన కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. డ్రగ్స్ కు బానిసైన ఉదయ్ కిరణ్ నేటి ఉదయం చంచల్ గూడ జైలులో ఖైదీలు, సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. తోటి ఖైదీలను గాయపరచడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, వైద్యుల సలహా మేరకు అతనిని ఎర్రగడ్డ మానసిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడ 15 రోజుల పాటు చికిత్స అందించనున్నారు.