: ఉత్తరాఖండ్ తరహాలో ఏపీని ఆదుకోవాలి, కేంద్రం ఆదుకోకపోతే మరింత నష్టపోతాం: రాజ్యసభలో సీఎం రమేష్
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై కొద్ది సేపటి క్రితం రాజ్యసభలో సీఎం రమేష్ మాట్లాడుతూ.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటుతో కష్టాలు పడుతోన్న ఏపీని పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీకి మంజూరు కావాల్సిన నిధులు ఇంకా మంజూరు కాలేదని అన్నారు. కేంద్రం ఏపీని ఆదుకోకపోతే రాష్ట్రం మరింత నష్టపోతుందని వివరించారు.