: ఇకపై 'అమెరికా' కిక్కిస్తుంది...'బడ్వైజర్' పేరు అమెరికాగా మారింది!


అమెరికా పేరు వింటేనే కొంతమంది పులకించిపోతారు. అమెరికాలో ఉద్యోగం సంపాదించాలని, డాలర్లు వెనకేసుకోవాలని ఆశపడని టెక్కీ ఉండడంటే అతిశయోక్తి కాదు. అలాంటి అమెరికా ఇకపై మత్తెక్కించనుంది. అమెరికా మత్తెక్కించనుండడం ఏంటని సందేహం వచ్చిందా?...అమెరికాకు చెందిన బడ్వైజర్ బీరు తయారీ సంస్థ తమ ప్రాడెక్టు పేరు మార్చింది. బడ్వైజర్ బీరు పేరును 'అమెరికా'గా మార్చింది. అమెరికా పేరు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని, ఇకపై అమెరికా కిక్కిస్తుందని తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ పేరు మార్పు చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది. కేవలం పేరుమార్పుతో సరిపెట్టుకోకుండా తమ బీరు క్యాన్లపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బొమ్మను కూడా ముద్రిస్తామని చెబుతోంది. అమెరికా ద బ్యూటిఫుల్, ది స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ వంటి సాహిత్యాలు కూడా ముద్రిస్తామని ఆ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News