: ఇక రాజకీయాలు వద్దు... అభివృద్ధికి సహకరించండి: హరీశ్ రావత్
ఉత్తరాఖండ్ అభివృద్ధిపైనే ఇక తాను దృష్టిని సారించనున్నట్టు ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రకటించారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్టు సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట అభివృద్ధికి అడ్డుగా నిలిచిన కుహనా రాజకీయాలు ఇక చాలని, అభివృద్ధికి సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇండియాలో ప్రజాస్వామ్యం పట్ల మరింత నమ్మకాన్ని కలిగించేలా ఉత్తరాఖండ్ ఉదంతం నిలుస్తుందని రావత్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నడుస్తున్న గూండా రాజ్యానికి అంతం పలుకుతామని తెలిపారు.