: కేసీఆర్ సమక్షంలోనే మా పెళ్లి జరగాలి: ప్రత్యూష ప్రియుడు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తమ వివాహం జరగాలని ప్రత్యూష ప్రియుడు మద్దిలేటి రెడ్డి ఆకాంక్షించాడు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను ప్రేమించినట్టు తెలిపాడు. తమ వివాహం కేసీఆర్ సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని అన్నాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతనినే వివాహం చేసుకుంటానని ప్రత్యూష బాలల హక్కుల సంఘం కార్యదర్శి అచ్యుతరావును కలిసి తెలిపింది. దీంతో ప్రత్యూష ఇప్పుడు మేజర్ అని, ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని ఆయన చెప్పారు. కాగా, మద్దిలేటి రెడ్డికి ఆమె దూరంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News