: 13న రాజ్యసభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ
ఈ నెల 13న రాజ్యసభకు హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈనెల 13 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆరోజు పలు సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ సభ్యులంతా ఆరోజు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదాపై ఆరోజు సభలో ఎన్డీయే సర్కారును ఇరుకునపెట్టే అవకాశం ఉండడంతో తమ పార్టీ ఎంపీలంతా అందుబాటులో ఉండాలని బీజేపీ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై రాజ్యసభలో జరగనున్న చర్చ ఆద్యంతం ఆసక్తికరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.