: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ పై మండిపడ్డ పంజాబ్ ఫ్యాన్స్


న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మారిసన్ పై పంజాబ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లను ప్రచారం చేసే ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కు డానీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు నిన్న జరిగిన మ్యాచ్ లో తాను వ్యాఖ్యాతగా పనిచేస్తున్న ఛానెల్ తరపున డానీ స్టేడియంలోకి వచ్చాడు. పంజాబీల వేషధారణతో మీసం, గడ్డంతో పాటు తలపాగా పెట్టుకుని మైక్ చేతబట్టి స్టేడియంలోకి వచ్చాడు. మారిసన్ తమ సంస్కృతిని అపహాస్యం చేసేలా డానీ ప్రవర్తించాడంటూ సామాజిక మాధ్యమాల్లో పంజాబ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. కాగా, సదరు ఛానెల్ చెప్పినట్లే తాను చేశానని, అంతేతప్పా, కావాలని తానేమీ ఈ విధంగా చేయలేదంటూ మారిసన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News