: తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తోంది...ఆదుకోండి: దేవేందర్ గౌడ్


గతంలో ఎన్నడూ లేనంత కరవు కొత్త రాష్ట్రం తెలంగాణలో విలయతాండవం చేస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ రాజ్యసభలో తెలిపారు. రాజ్యసభలో కరవుపై ఆయన మాట్లాడుతూ, తీవ్ర కరవుతో అల్లాడుతున్న తెలంగాణను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక సుమారు 14 లక్షల మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు తరలిపోయారని ఆయన రాజ్యసభకు తెలిపారు. రాష్ట్రంలోని 225 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. కరవు నుంచి ఆదుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News