: బాలయ్య, చిరంజీవి కోసమే ఈ గుండు... నాకు కేన్సర్ లేదు!: వేణుమాధవ్


తనకు కేన్సర్, బీపీ, షుగర్, అల్సర్ తదితర రోగాలున్నాయని, ఏ క్షణమైనా తెలుగు ప్రజలకు దూరమవుతానంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై హాస్య నటుడు వేణుమాధవ్ స్పందించాడు. ఈ మధ్యాహ్నం పోలీసు స్టేషన్ కు గుండుతో వచ్చి తనపై జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, "మీరు అడగవచ్చు. కేన్సర్ లేకుంటే గుండెందుకు చేయించుకున్నారని. నేను మొన్న తిరుపతి వెళ్లాను. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని (ఫోటో చూపుతూ) బాలయ్య గారి 100వ సినిమా, చిరంజీవిగారి 150 సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మొక్కుకుని ఆ భగవంతుడిని కోరుకున్నాను. 'గత కొద్ది కాలంగా అనారోగ్యంపాలైన వేణుమాధవ్ ఇక మనకు లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్...' అంటూ నాపై ప్రచారం చేశారు. మరిప్పుడు మాట్లాడుతున్నది వేణుమాధవా? వాడి తమ్ముడా? వాడి బావమరిదా? ఎందుకిది? ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది తేల్చాలని కేసు పెట్టడం కోసం కుషాయిగూడ స్టేషనుకు వచ్చాను. ఎవరెవరు చేశారో వారందరిపైనా కేసు పెట్టడం జరిగింది" అని వివరించాడు.

  • Loading...

More Telugu News