: అభిమానులను ఆకట్టుకుంటోన్న ‘కర్ గయి చుల్’ పాట.. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 5 కోట్ల హిట్లు
ఈ ఏడాది మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ మూవీ ‘కపూర్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. కుటుంబ సంబంధాల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా స్టోరీకే కాదు.. దీనిలోని ‘కర్ గయి చుల్’ పాటకూ అభిమానులు నీరాజనం పడుతున్నారు. ఫజల్‌పూరియా కంపోజ్ చేసిన ‘చుల్’ ఆల్బమ్ నుంచి తీసుకున్న ‘కర్ గయి చుల్’ పాటకు యూ ట్యూబ్‌లో హిట్లపై హిట్లు వచ్చిపడుతున్నాయి. యూ ట్యూబ్‌లో ఈ పాటను ఉంచినప్పటి నుంచి ఇప్పటివరకు 5కోట్ల హిట్లు వచ్చాయి. భారీ స్థాయిలో అభిమానులు ఈ పాటను వీక్షిస్తుండడంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతున్నారు. సిద్దార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, అలియా భట్, సీనియర్ నటుడు రిషీకపూర్ ప్రధాన తారాగణంగా ‘కపూర్ అండ్ సన్స్’ సినిమా రూపొందింది.