: జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు అరెస్ట్!... ఓవర్ టేక్ చేసిన విద్యార్థిని చంపేశానని ఒప్పుకోలు!


తన కారును ఓవర్ టేక్ చేశాడన్న చిన్న కారణంతో పేట్రేగిపోయిన బీహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు రాఖీ యాదవ్ కు పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు వేశారు. ఇటీవలే బీహార్ లోని గయలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తన కారును ఓవర్ టేక్ చేసిన ఓ ఇంటర్ విద్యార్థిపై దాడి చేసిన రాఖీ యాదవ్... తన వద్ద ఉన్న ఫారిన్ మేడ్ పిస్టల్ తో అతనిని కాల్చేశాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా, రాఖీ యాదవ్ పరారయ్యాడు. దేశవ్యాప్తంగా ఈ కేసు పెద్ద చర్చనీయాంశం కావడంతో రాఖీ యాదవ్ కోసం బీహార్ పోలీసులు వేట సాగించారు. నేటి తెల్లవారుజామున రాఖీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దాడిలో రాఖీ యాదవ్ వాడిన ఫారిన్ మేడ్ పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిగిన తర్వాత తప్పించుకుని చివరకు పోలీసులకు చిక్కగానే రాఖీ యాదవ్ తన తప్పును ఒప్పేసుకున్నాడు. తన కారును ఓవర్ టేక్ చేసిన కారణంగానే తాను ఆ విద్యార్ధిని కాల్చేశానని అతడు ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. రాఖీ యాదవ్ తనకు తానుగా లొంగిపోలేదని గయ ఎస్ఎస్పీ గరిమా మాలిక్ చెప్పారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News