: జ్వరమొచ్చింది... పుదుచ్చేరి రాలేను: రాహుల్ గాంధీ


రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటన నిమిత్తం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ, తాను ఈ పర్యటనకు రావడం లేదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తాను ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, రెండు, మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన మీదట పుదుచ్చేరికి రాలేకపోతున్నానని, తాను తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మిస్ అవుతున్నానని, తన పర్యటన షెడ్యూల్ వివరాలు అప్ డేట్ చేస్తానని ట్వీట్ చేశారు. ముందనుకున్న ప్రకారం 10, 11 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టు తెలిపారు. కాగా, పుదుచ్చేరి పర్యటనకు రాహుల్ వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేఖ వచ్చిన నేపథ్యంలోనే రాహుల్ పర్యటన రద్దు కావడం కాకతాళీయం. బెదిరింపు లేఖను సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం శాఖ, ఆయనకు అదనపు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను కల్పించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News