: అమరావతిలో మరో అపశ్రుతి... కాంక్రీట్ మిల్లర్ లో పడి కార్మికుడి దుర్మరణం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇటీవల అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి అక్కడి పనుల వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిల్లర్ లో పడి ఓ కార్మికుడు చనిపోయాడు. కార్మికులు చూస్తుండగానే మిల్లర్ లో పడిపోయిన కార్మికుడు చనిపోయాడు. దీంతో తాత్కాలిక సచివాలయ పనుల్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది.