: టీఆర్ఎస్ నేతలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు...నేను కాంగ్రెస్ లో చేరడం లేదు!: రేవంత్ రెడ్డి ఆరోపణ


తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నానంటూ టీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను కాంగ్రెస్ లో చేరడం లేదని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు వాళ్ల సొంత పత్రికలో ఈ రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని, అంతేకానీ, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆర్డీఎస్ పనులు పూర్తి చేయిస్తానని గతంలో కేసీఆర్ అన్నారని, ఆ హామీని మరచి తన ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News