: నేటి నుంచి చార్ థామ్ యాత్ర ప్రారంభం
చార్ థామ్ యాత్ర అనగానే గుర్తుకు వచ్చేది గంగానది పరవళ్లు, మంచు కొండలు, అక్కడి సుందర దృశ్యాలు. సంవత్సరంలో ఆరునెలల పాటు మాత్రమే ఆలయాలు తెరచి ఉండగా, మరో ఆరు నెలలు మూసివేస్తారు. ప్రతి ఏటా మే నెలలో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చార్ ధామ్ యాత్ర ఈరోజు నుంచి మొదలైంది. ఈ సందర్భంగా కేథార్ నాథ్ లో ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కేదార్ నాథ్ ఆలయ తలుపులను తెరిచారు. దైవదర్శనం నిమిత్తం భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. కాగా, చార్ ధామ్ లో ఒకటైన బదరీనాథ్ ఆలయాన్ని ఈనెల 11వ తేదీన తెరవనున్నారు.