: చెన్నమనేనికి కేసీఆర్ నివాళి


సీనియర్ రాజకీయవేత్త, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు భౌతికకాయానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నమనేని నేటి తెల్లవారుజామున హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాలుపంచుకున్న చెన్నమనేని... ఆ తర్వాత సీపీఐలో చేరి సిరిసిల్ల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సీపీఐని వీడిన ఆయన టీడీపీలో చేరి మరో పర్యాయం అక్కడి నుంచే గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం నేఫథ్యంలో టీడీపీకి రాజీనామా చేసిన చెన్నమనేని టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరినా క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా జరిగిన చెన్నమనేని తన కుమారుడు చెన్నమనేని రమేశ్ ను బరిలోకి దించారు. టీఆర్ఎస్ నేతగా ఉన్న చెన్నమనేని మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్... కొద్దిసేపటి క్రితం చెన్నమనేని ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News