: చర్లపల్లి జైలులో ఉరేసుకుని ఖైదీ ఆత్మహత్య


హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఒక జీవిత ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవిత ఖైదీ సెల్వరాజ్ జైల్లోని బాత్రూమ్ లో ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల క్రితమే మెదక్ జైలు నుంచి చర్లపల్లి జైలుకు సెల్వరాజ్ ను మార్చినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News