: కారుతో ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్యే కొడుకు కాల్చి చంపాడు
అధికార గర్వం తలకెక్కిన ఎమ్మెల్యే కొడుకు బీహార్ లో దారుణానికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే...గయ జిల్లాకి చెందిన ఆదిత్య (19) అనే యువకుడు స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. అదే రోడ్డులో జేడీయూ నాయకురాలు మనోరమాదేవి భర్త బింది యాదవ్, కుమారుడు రాకీ యాదవ్ కూడా కారులో ప్రయాణిస్తున్నారు. స్నేహితులతో కారులో వెళ్తున్న ఆదిత్య వారి కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఆగ్రహించిన రాకీ అతడిని కాల్చి చంపాడు. ఆదిత్య అక్కడికక్కడే కుప్పకూలడంతో రాకీ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బింది యాదవ్, అతని అంగరక్షకుడు రాజేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.