: కలెక్టర్ జిల్లాకు 'రాజు'నని భావిస్తున్నాడు..సీఎం బంధువునంటూ ఎవర్నీ పట్టించుకోవడం లేదు: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ప్రజాప్రతినిధులను భాస్కర్ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. కలెక్టర్ జిల్లాకు 'రాజు'నని భావిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. ఆయనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దెందులూరు, తణుకు నియోజకవర్గాలకు మాత్రమే ఆయన ఉపాధిహామీ పనులు కేటాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బంధువునంటూ ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయకుండా ఇబ్బందులపాలు చేశారని ఆయన ఆరోపించారు.