: కర్నూలు జిల్లాలో ఘోరం...30 ఇళ్లను కూల్చిన గాలివాన


కర్నూలు జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. నేటి తెల్లవారు జామున కురిసిన వర్షం, వీచిన బలమైన గాలులు మంత్రాలయం, కోచిగి ప్రాంతంలో 35 పూరి గుడిసెలను నేలకూల్చాయి. ఈ అకాల గాలివానకు జిల్లా వ్యాప్తంగా పలువురు నిరాశ్రయులు కాగా, సుమారు 25 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఎమ్మిగనూరు-కొడుమూరు రహదారిపై చెట్లు అడ్డంగా పడిపోయాయి. ఓ ట్రక్ అమాంతం గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది. దీంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. మండు వేసవిలో చల్లని వాతావరణాన్ని తెస్తూ వానలు పడుతున్నాయని సంతోషపడాలో, గాలుల బీభత్సానికి నిరాశ్రయులు అవుతున్నందుకు బాధపడాలో తెలియని స్థితి నెలకొంది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటీన బంధువులు ఆసుపత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News