: బీజేపీ మీద నమ్మకం ఉంది...అన్నీ చేస్తుంది: కంభంపాటి రామ్మోహనరావు
బీజేపీ మీద నమ్మకం ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాను మించిన ప్రయోజనాలు సమకూరుస్తుందని అన్నారు. ఆర్థిక లోటును ఉన్నపళంగా పూడించడం సాధ్యం కాదని చెప్పిన ఆయన, సాధ్యమైనంత మేర బీజేపీ ఆ లోటును పూరిస్తుందని ఆయన అన్నారు. అయితే అన్నీ అడగ్గానే ఇచ్చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన తెలిపారు. కేంద్రం నెమ్మదిగా అన్ని పనులను పూర్తి చేస్తుందని ఆయన చెప్పారు. అంతవరకు ఓపిక అవసరమని ఆయన చెప్పారు. సహనంగా ఉంటే అన్నీ సాధ్యమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.