: రాణించిన స్టోయిన్స్, సాహా, బ్రాత్ వైట్...ఢిల్లీ లక్ష్యం 182


మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తి కరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు కెప్టెన్ మురళీ విజయ్ (25), స్టోయిన్స్ (52) శుభారంభం ఇచ్చారు. ధాటిగా ఆడే క్రమంలో మురళీ విజయ్ అవుటైన వెంటనే హషీమ్ ఆమ్లా (1) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. సాహా (53) దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. మ్యాక్స్ వెల్ (16) విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో మోరిస్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా, షమి, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. 182 పరుగుల విజయలక్ష్యంతో ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులో డికాక్ (4), సంజు శాంసన్ (6) ఉన్నారు.

  • Loading...

More Telugu News