: చిన్నచిన్న ఆనందాలన్నీ కలిపితే బ్రహ్మోత్సవం: కాజల్


చిన్నచిన్న ఆనందాలన్నీ కలిపితే పెద్ద బ్రహ్మోత్సవమని ప్రముఖ నటి కాజల్ తెలిపింది. హైదరాబాదులో జరిగిన బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, బ్రహ్మోత్సవం ఎంత గొప్పగా జరుగుతుందో ఈ సినిమా అంత గొప్పగా ఉంటుందని చెప్పింది. మహేష్ బాబుతో తనకు ఇది రెండో సినిమా అని తెలిపింది. ఈ సినిమాలో పెద్దపెద్ద నటీనటులతో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. సినిమా పెద్ద హిట్ అవుతుందని కాజల్ ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News