: ఈ మధ్యే గుడ్ బాయ్ నుంచి బ్యాడ్ బాయ్ గా మారాను: సుధీర్ బాబు
తిరుపతిలోని బ్రహ్మోత్సవాన్ని తెచ్చి హైదరాబాదులో నిర్వహించినట్టుందని మహేశ్ బావ, హీరో సుధీర్ బాబు చెప్పాడు. ఇంత గ్రాండ్ గా జరుగుతున్న ఈ ఆడియో వేడుకకి తనను పిలవకపోయుంటే తాను నిజంగానే బ్యాడ్ గా మారేవాడినని సుధీర్ బాబు పేర్కొన్నాడు. సినిమా చాలా రిచ్ గా కనిపిస్తోందని, పాటలన్నీ చాలా క్లాస్ గా ఉన్నాయని అన్నాడు. ఇక ఇటీవల తాను హిందీలో విలన్ గా నటించిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఈ మధ్యే సినిమాల్లో గుడ్ బాయ్ నుంచి బ్యాడ్ బాయ్ గా మారానని చెప్పాడు. దీంతో నవదీప్ కల్పించుకుని 'మహేష్ నీకు చాలా కాలం నుంచి తెలుసు కనుక మహేష్ బ్యాడ్ బాయా? లేక గుడ్ బాయా?' అని అడిగాడు. దీనికి సుధీర్ సమాధానమిస్తూ, 'ముందు గుడ్ బాయ్ కి, బ్యాడ్ బాయ్ కి అర్థం ఏమిటి?' అని అడిగాడు. దీంతో ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదని చెప్పి పాటను ఆవిష్కరించాడు.