: అసోం, మేఘాలయలో భూకంపం... తప్పిన ప్రమాదం


ఈశాన్య భారతాన్ని శనివారం భూకంపం వణికించింది. అసోంతోపాటు మేఘాలయ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.13 గంటలకు మేఘాలయలోని తూర్పు ఖాసి పర్వత ప్రాంతం కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4 పాయింట్ల మ్యాగ్నిట్యూడ్ గా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. భూ అంతర్భాగంలో పది కిలోమీటర్ల లోతులో దీని ప్రధాన కేంద్రం ఉందని తెలిపింది. భూ ప్రకంపనలకు కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదు. శుక్రవారం రాత్రి కూడా అసోంలో స్వల్ప భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3 పాయింట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News