: నేతల జంపింగ్ తో వైసీపీ తెలంగాణకు కొత్త కార్యవర్గం


ఇన్నాళ్లూ వైసీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడి బాధ్యతలు చూసిన ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పార్టీలో తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ నేతలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో... తెలంగాణలో వైసీపీ పునరుజ్జీవం దిశగా కొత్త కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నియమించారు. వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ కు బాధ్యతలు అప్పగించారు. కొండా రాఘవరెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు అధికార ప్రతినిధి బాధ్యతలు కూడా ఇచ్చారు. ఇక తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాష్, హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ ను నియమించినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News