: సుశీల్ కుమార్ షిండే కుమారుడితో...బాలీవుడ్ హీరో కుమార్తె డేటింగ్?
బాలీవుడ్ లో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. కేంద్ర మాజీ హోమ్ శాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమారుడు వీర్ పహారియాతో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ తాజాగా కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నప్పటికీ అంతకు ముందు మరో నటి అమృతా సింగ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు సారా తో పాటుగా, ఇబ్రహీం అలీఖాన్ అనే కుమారుడున్నాడు. ఈ మధ్యే సారా బాలీవుడ్ లో అరంగేట్రం చేయనుందనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా, దుబాయ్ లో చదువుకుంటున్న వీర్ పాప్ స్టార్ గా నిలదొక్కుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.